పూల జడ

పూలజడ... చిన్నప్పటి పూలజడ ఫోటో చూస్తే మీకు ఏమి గుర్తొస్తుంది ??????????????నాకు కూడా పూలజడ అనగానే, చిన్నప్పుడు మా అమ్మ నాకు వేసిన పూలజడ గుర్తొస్తుంది....ఎందుకు ఇంత కోపం ??
అయితే పూలజడ వేసుకుంటే ఆనందంగా ఉండాలి కానీ, ఇలా చిరాగ్గా మొహం పెట్టాను ఏమిటా? అదే కదా డౌట్.... దానికో చిన్న కధ ఉంది.....

నేను చిన్నప్పుడు అన్నం తినడానికి అమ్మని చాలా విసిగించేదాన్ని. అప్పుడు నాకు ఆరేళ్ళు ఉంటాయేమో ,ఒక రోజు అందరం కలిసి మధ్యానం భోజనం చేస్తుంటే, అందరిదీ తినడం అయిపోయింది,  నాది మాత్రం అలాగే ఉంది..... అమ్మ ఎంత చెప్పినా నేను తినట్లేదు.... ఇంకా చిరాకు వచ్చి చారు లో గరిటి నా మొహం మీద కొట్టింది...... 


eyebrows కి తగిలింది దెబ్బ,.......  రక్తం మొదలయ్యింది.…ఇంక అమ్మకి బాధ వేసి, నీకు సాయంత్రం పూలజడ వేస్తాను అని ఊరుకోపెట్టింది..... మరి అప్పటిదాకా అమ్మ -అక్కకి, పక్కింటి వాళ్ళకి తప్ప, నాకు ఎప్పుడు వేయలేదు పూలజడ........


సాయంత్రం సిల్క్ లంగా వేసి, ఇలా చామంతి పూలజడ వేసి, ముందు వనస్థలిపురం లో ఫోటో స్టూడియో కి , ఆ తరువాత, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది..... ఇంత జరిగింది కాబట్టే అంత చిరాగ్గా ఉంది ఆ మొహం

ఇప్పటికి కూడా మొహం మీద మచ్చ్చ అలాగే మిగిలిపోయింది.…… ఫోటో  చూసినప్పుడల్లా గరిటె-పూలజడ- హాస్పిటల్ , నాన్నగారు అమ్మని తిట్టడం, ఇవన్ని గుర్తొస్తాయి.…

అలా అమ్మకి వచ్చిన పూలజడ కళ, ఈ రోజు ఈ పెళ్లిపూలజడ మొదలు పెట్టడానికి ఇంత  మనో ధైర్యం ఇస్తుందని మాత్రం ఆ రోజు తెలియదు.

Kalpana Rajesh
Pellipoolajada 
9701544988